ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 15 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాబోతున్నాయి. 15వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఇక సమావేశాల మొదటి రోజున జరిగే బీఏసీ సమావేశంలో సభ అజెండాను ఖరారు చేయనున్నారు.

ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చర్చ చేయాలని అధికార పక్షం భావిస్తోంది. పోలవరం – పునారావాస ప్యాకేజీ పైన సభలోనే చర్చించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు.. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి సభ ద్వారా ప్రజల ముందు ఉంచాలని వైస్సార్సీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రతిపక్షాలు ఆందోళన చేస్తోన్న నిత్యావసర ధరలు.. శాంతి భద్రతల పైన చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లులను మరోసారి సభ ముందుకు తీసుకొస్తుందని వినికిడి.

హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్చు ఇవ్వడంతో.. న్యాయ పరంగా అడ్డంకులను పరిష్కరించుకున్న తర్వాత మాత్రమే మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.