టిఆర్ఎస్ పార్టీ ఫై విరుచుకుపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy broke into TRS party


మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..టిఆర్ఎస్ తీరు ఫై విరుచుకపడ్డారు. వందల కోట్లు ఖర్చు పెట్టిన హుజురాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవలేదన్నారు. మార్కెట్లో గొర్రెలను కొన్నట్టుగా టీఆర్ఎస్.. ఇతర పార్టీల నేతలను కొంటున్నారని కానీ మునుగోడు ఓటర్లు అలా అమ్ముడుపోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబానికి మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసలుగా మారారని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలన కోసం కేంద్రం 800 కోట్లు ఇచ్చిందని తెలిపారు.

రాష్ట్రంలో అసైన్డ్, బంజరు భూములు కనిపిస్తే టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బతికున్న వారికి సమాధులు కట్టడం టీఆర్ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ బొందపెట్టాలనుకుంటే..కేంద్ర ఎన్నికల సంఘం కాపాడిందన్నారు. ఎనిమిదేళ్లుగా సచివాలయానికి వెళ్లని ఏకైక సీఎం.. కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. రాష్టంలో జరిగే అన్ని అక్రమాలకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్నారు.