ఏపీలో జూలై 26 నుంచి టెన్త్ పరీక్షలు!

ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు

students
students-file

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ పరీక్షలు జూలై 26 నుంచి జరిగే సూచనలు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జూలై లో పరీక్షలు నిర్వహించే వాతావరణం ఉంటుందని విద్యా శాఖ భావిస్తోంది. రాష్ట్రంలోని 6.28 లక్షల మంది విద్యార్థులు 4వేలకు పైగా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. , ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా ఏడు పేపర్లు మాత్రమే నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో పరిస్థితులు చక్కబడితే, జూలై మొదటి వారంలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/