భారీ పేలుళ్లు..78 మంది మృతి

3700 మందికి గాయాలు

Huge-explosion-in-beirut

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. 2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల బీరుట్ పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందగా.. దాదాపు 4 వేల మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి అక్కడ భారీగా భవనాలు కుప్పకూలడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. రెండు భవనాలూ పూర్తిగా నేలమట్టమయ్యాయి. అత్యవసర నిధి కింద 100 బిలియన్ డాలర్లు విడుదల చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.

కాగా ఈ భారీ పేలుళ్ల‌తో రాజ‌ధాని బీర‌ట్‌లో చాలా ప్రాంతాల్లో ఇండ్ల కిటికి అద్దాలు, పైకప్పులు కూలిపోయాయి. అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లధాటికి భయపడిన జనం ఇండ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల భూమి కంపించింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. అదేవిధంగా పేళుడు శ‌బ్ధాలు ఘ‌టనా స్థ‌లానికి 240 కి.మీ. దూరంలో ఉన్న సైప్రస్‌లోని నికోసియా దీవికి కూడా వినిపించాయాని తెలిపారు. 19751990 మ‌ధ్య‌కాలంలో దేశంలో జ‌రిగిన అంత‌ర్యుద్ధంలో కూడా ఇంత భారీ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, పేలుళ్లు జ‌రిగిన ప్రాంతానికి చుట్టూ ఉన్న భ‌వ‌నాల‌న్నీ కూలిపోయాయ‌ని ఓ సైనికుడు వెళ్ల‌డించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/