కర్ణాటకలో అమల్లోకి గోవధ చట్టం

13 ఏళ్ల లోపు గోవులు, ఎద్దులు, దున్నలు, గేదెల వధ నిషేధం

కర్ణాటకలో అమల్లోకి గోవధ చట్టం
Anti-cow slaughter bill passed in Karnataka Assembly

బెంగళూరు: కర్ణాటకలో గోవధ చట్టం అమల్లోకి వచ్చింది. శీతాకాల సమావేశాల్లో భాగంగా బిల్లును సభలో ప్రవేశపెట్టగా విధానసభ నిన్న దీనిని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం 13 ఏళ్ల లోపు ఆవులు, ఎద్దులు, దున్న, గేదెలను వధించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 13 ఏళ్లు దాటిన ఎద్దును పరిశోధన కోసం, లేదంటే అనారోగ్యం పాలైనట్టు పశువైద్యులు నిర్ధారిస్తే దానిని వధించవచ్చు.

అలాగే, వాటిని వధించేందుకు ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలించడాన్ని కూడా నేరంగా పరిగణిస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి గోవును వధిస్తే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే, రూ. 50 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ప్రస్తుతం ఇటువంటి చట్టమే గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అమల్లో ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/