నేడు ‘వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర’ మూడో విడత నగదు జమ

2 లక్షల 48 వేల 468 మంది లబ్దిదారులకు ఆర్థిక సాయం

AP CM YS Jagan-YSR Vaahana mitra scheme
AP CM YS Jagan-YSR Vaahana mitra scheme

Amaravati: ఏపీ ప్రభుత్వం ‘వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర’ మూడో ఏడాది ఆర్థికసాయాన్నిఇవాళ విడుదల చేయనుంది. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ సొంతంగా కలిగి, వాటిని నడిపే డ్రైవర్లకు వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద రూ.10 వేల చొప్పున మంగళవారం అందించనున్నారు. . తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ బటన్ నొక్కి వారి ఖాతాల్లో మొత్తం రూ.248.47 కోట్లను జమ చేయనున్నారు. 2 లక్షల 48 వేల 468 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందనుంది. గతేడాది 2 లక్షల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా.. ఈ ఏడాది కొత్తగా 42 వేల 932 వేల మంది దరఖాస్తు చేశారు. గతేడాది కంటే ఈసారి 25,517 మంది లబ్ధిదారులు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/