తెలంగాణలో మరో విదేశీ భారీ పెటుబడి

కెనడాకు చెందిన ఇవన్హో కేంబ్రిడ్జి అనే సంస్థ పెట్టుబడులు..మంత్రి కేటీఆర్​

హైదరాబాద్ : రాష్ట్రంలో కెనడాకు చెందిన ఇవాన్‌ హో కేంబ్రిడ్జ్‌ అండ్‌ లైట్‌ హౌస్‌ కాంటన్‌ జీనోమ్‌ వ్యాలీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. కెనడాకు చెందిన సంస్థ సుమారు 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ల్యాబ్ స్పేస్‌లో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో.. ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ ఇండియా ఎండీ చాణక్య చక్రవర్తి, సంస్థ సీనియర్‌ ప్రతినిధులు శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సంస్థ జీనోమ్ వ్యాలీలో ఉన్న ఎంయన్ పార్క్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ మంత్రికి తెలిపింది. కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో లైఫ్ సైన్సెస్ రంగంలో భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని కంపెనీ పేర్కొంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కెనడాకు చెందిన ఇవన్హో కేంబ్రిడ్జి అనే సంస్థ పెట్టుబడులు పెట్టనుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.747 కోట్లు) జీనోమ్ వ్యాలీలో ఎంఎన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పది లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో సంస్థను ఏర్పాటు చేస్తారన్నారు.

లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ రంగంలో పెన్షన్ ఫండ్ తో ఈ తరహా పెట్టుబడులు దక్షిణాసియాలోనే ఇది మొదటిసారని ఆయన అనారు. దేశంలో లైఫ్ సైన్సెస్ రంగానికి బెంచ్ మార్క్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పెట్టుబడులు రావడం వల్ల లైఫ్ సైన్సెస్ రంగంలో లీడర్ గా ఉన్న హైదరాబాద్ మరింత ముందుకు పోతుందని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/