దేశంలో కొత్త‌గా 1,68,063 క‌రోనా కేసులు

ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 4,461

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొనసాగుతోంది. కొత్త‌గా 1,68,063 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, దేశంలో నిన్న 69,959 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. నిన్న క‌రోనాతో 277 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 8,21,446 మందికి చికిత్స అందుతోంది. డైలీ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 4,461కు పెరిగింది. నిన్నటి వ‌ర‌కు మొత్తం 69,31,55,280 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న ఒక్క‌రోజు 15,79,928 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/