తెలంగాణలో బిఆర్‌ఎస్ టైమ్ అయిపోయింది..బిజెపి వచ్చే సమయం ఆసన్నమైందిః అమిత్ షా

Amit Shah addresses BJP’s Vijaya Sankalpa Sabha at Gadwal

గద్వాల్: వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అబద్ధపు మాటలతో సిఎం కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గద్వాల బిజెపి విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. ఇచ్చిన హామీలను కెసిఆర్ నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. బిఆర్‌ఎస్ టైమ్ అయిపోయిందని, బిజెపి వచ్చే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. బిఆర్‌ఎస్‌కు విఆర్‌ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, బిసిలకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. బిసి సిఎం కావాలంటే బిజెపికి ఓటేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులను కెసిఆర్ పూర్తి చేయలేదని అమిత్ షా విమర్శించారు. నిరుద్యోగులను కెసిఆర్ మోసం చేశారని విమర్శించారు. జోగులాంబకు మోడీ వంద కోట్లు నిధులు విడుదల చేస్తే కెసిఆర్ వినియోగించలేదని ధ్వజమెత్తారు.

ఉద్యోగాల పేరిట సిఎం కెసిఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. టిఎస్‌పిఎస్సీ నుంచి 7 నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి.. ప్రశ్నపత్రాలను లీక్ చేశారు. అలాంటి ఘటనల వల్ల ప్రవళిక, అహ్మద్ వంటి యువత ఆత్మహత్య చేసుకున్నారు. అవి బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని.. బిజెపి అధికారంలోకి వస్తే.. ఐదేళ్లలో 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తి చేస్తమాని అమిత్ షా వెల్లడించారు.