అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం

గత 42 రోజులు ఏపీ లో అంగన్వాడీలు తమ డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు ప్రభుత్వం తో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు. కానీ ఈరోజు సోమవారం రాత్రి మంత్రి బొత్స ..అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపగా అవి సఫలం అయ్యాయి.

అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చుతామని మంత్రి బొత్స తెలిపారు. అంగన్వాడీల 13 డిమాండ్లలో 10 డిమాండ్లు నెరవేర్చామన్నారు. మిగతా డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం జగన్ తో చర్చిస్తామని చెప్పారు. మంత్రి బొత్స ప్రకటనతో అంగన్వాడీలు సమ్మె విరమించనున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మంగళవారం దీనిపై స్పష్టత రానుంది. మరోపక్క అంగన్వాడీలకు మద్దతుగా ఏపీ బంద్‌కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం తో చర్చలు సఫలం అయ్యాయి కాబట్టి బంద్ ఉంటుందో .ఉండదో చూడాలి.