కలుగుల్లో నుంచి ఎలుకలన్నీ బయటికొస్తున్నాయి!

సిఐడి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో అమరావతి ప్రాంతంలో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటి కొస్తున్నాయని అన్నారు. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్‌ జిడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు గారు మీరు సిఐడి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తెలుతుందని విజయసాయిరెడ్డి సవాల్‌ విసిరారు. ఇంకా తీసేసిన తహశీల్దారులంగా పళ్లు పటపట కొరుకుతున్నారు. విషం కక్కడంతో పోటీలు పడుతున్నారు. వైఎస్‌ జగన్‌ గారి నివాసం మీ హయంలోనే పూర్తయింది. అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. లింగమనేని గెస్ట్‌ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదు కదా అని అన్నారు. తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్‌ తయారైదంటూ టిడిపి నేతలను విమర్శిస్తు విజయసాయిరెడ్డి ట్విట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/