ముగిసిన టిడిపి పార్లమెంటరీ పార్టీ భేటి

Telugu Desam Party
Telugu Desam Party

విజయవాడ: టిడిపి పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు విజయవాడలో నిర్వహించిన పార్లమెంటరీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి గల్లా జయదేవ్, రామ్మోహన్‌ నాయుడు. తోట సీతారామ లక్ష్మి, కనకమేడల రవీంద్ర కుమార్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో దాదాపు 12 అంశాలపై చర్చించినట్టు సమాచారం. అమరావతి, మూడు రాజధానులు, రాష్ట్ర పునర్విభజన, పోలవరం ప్రాజెక్టు, మీడియా, టిడిపి శ్రేణులపై అక్రమ కేసులు, సిఏఏ, ఎన్‌ఆర్‌సి, కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం వివరాలను కాసేపట్లో నిర్వహించననున్న మీడియా సమావేశంలో టిడిపి నేతలు వివరించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/