ఏపి సిఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

Chandrababu , YS Jagan
Chandrababu , YS Jagan

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి సిఎం జగన్‌కు లేఖ రాశారు. అయితే ప్రజావేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని కోరారు. తన నివాసానికి దగ్గరగా ఉన్న ప్రజా వేదికను అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం బాబు ఉంటున్న నివాసంలోనే కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. యాజమాన్యం షరతుల మేరకు ఇంటిని వినియోగించుకుంటున్నానని లేఖలో వివరించారు. అందువల్ల పక్కనే ప్రజావేదిక ఉన్నందున తన అధికారిక కార్యకలాపాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/