గంగమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu wife Bhuvaneswari
Chandrababu wife Bhuvaneswari

కుప్పం: ఏపి సిఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన గంగమ్మ అమ్మవారి జాతరకు వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు సిఎం దంపతులను శాలువాలతో సన్మానించారు. కుప్పంలో గంగమ్మ అమ్మవారి జాతర వైభవంగా సాగుతుంది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. వేలాది భక్తులు జాతరలో పాల్గొన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/