లోకకల్యాణ్‌ సంకల్ప్‌ పత్ర పేరుతో మేనిఫెస్టో రిలీజ్‌ చేసిన అమిత్ షా

YouTube video
HM Shri Amit Shah releases Lok Kalyan Sankalp Patra in Lucknow, Uttar Pradesh.

లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. రైతు సంక్షేమం, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యతనిచ్చేలా సంకల్పపత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది. లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 25కోట్ల మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో ప్రతి రైతు, పేదలు, మహిళలు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా పనిచేస్తున్నామన్నారు..

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలుః

.లోకకల్యాణ్‌ సంకల్ప్‌ పత్ర పేరుతో మేనిఫెస్టో
.రైతులందరికీ ఉచిత విద్యుత్‌
.షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రూ.5వేల కోట్లు
.గోధుమలు, వరికి కనీన మద్దతు ధర
.ఐదు వేల కోట్లతో వ్యవసాయ సాగునీటి పథకం
.రూ.25,000 కోట్ల వ్యయంతో సర్దార్ పటేల్ అగ్రి-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్
.60 లక్షల మందికి రుణ కేటగిరీ
.బంగాళదుంప, టమోటా, ఉల్లి వంటి అన్ని పంటలకు కనీస ధర కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు
.చెరుకు రైతులకు 14 రోజుల్లోగా చెల్లింపు, ఆలస్యమైతే వడ్డీతో సహా నిషాద్రాజ్ బోట్ సబ్సిడీ పథకం

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/