కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా సినీ నటిపై దుండగులు దాడి

కేబీఆర్ పార్కులో దారుణం చోటుచేసుకుంది. ఈవ్నింగ్ వాక్‌‌కు వెళ్లిన సినీ నటి చౌరాసియా మీద దుండగుడు దాడి చేసి.. ఆమె ఫోన్ లాక్కొని పారిపోయాడు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ కావడంతో పార్కులో పబ్లిక్ తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఉన్న చౌరాసియాపై కన్నేసిన దుండగుడు ఆమెను అడ్డగించి సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు.

ఈ ఘటనలో గాయాలపాలైన ఆమె వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో హుటాహుటిన కేబీఆర్ పార్క్‌కి చేరుకున్న పోలీసులు చౌరాసియాను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.