విద్యార్థుల పట్ల సీఎం జగన్ తొండి వైఖరి అవలంబిస్తున్నారని పవన్ ఆగ్రహం

The services of Police Officer Rajeshwari are commendable says pawan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై విరుచుకపడ్డారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని.. బాలలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. చిన్నారులైన విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ట్విట్టర్ ద్వారా పంచ్ డైలాగ్స్ పేల్చారు.

ఎన్నికలకు ముందు.. అమ్మ ఒడి అని ఊరించిన జగన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమ్మకానికో బడి పథకాన్ని భేషుగ్గా అమలు చేస్తున్నారని.. విద్యార్థులను మానసికంగా కృంగదీస్తున్నారని విరుచుకుపడ్డారు. పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసి వారి చదువులపై దెబ్బ కొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. పవన్ విరుచుకుపడ్డారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగించేందుకు నాలుగు అవకాశాలను ఇస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 12 న ఓ సర్కులర్ (Circular Memo No 1072635/CE/A1/2020) జారీ చేసిందని తెలిపారు. ఈ విధాన నిర్ణయం 2200 స్కూళ్లను 2 లక్షల మంది విద్యార్థులను 6700 మంది ఉపాధ్యాయులను; 182 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలను దాదాపు 71 వేలమంది విద్యార్థులను 116 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలను దాదాపు రెండున్నర లక్షల విద్యార్థులు సిబ్బందితో పాటు వారి కుటుంబాలను సైతం అతలాకుతలం చేసిందన్నారు.

డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? ప్రభుత్వ విద్యాసంస్థల లో ఖాళీ గా ఉన్న టీచర్ల పోస్టుల ను ఎప్పుడు భర్తీ చేస్తారు? పాఠశాల లను కళాశాల లను స్వాధీన పరుచుకోవాలన్న నిర్ణయం తీసుకొనే ముందు టీచర్లను లెక్చరర్లను నియ మించాలన్న ఆలోచన మీకు రాలేదా? అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేస్తోంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీత హరేకల్‌ హజబ్బ స్కూలుని కట్టారు. పండ్లు అమ్మిన డబ్బుతో హరేకల హజబ్బ స్కూలును ఎలా నిర్మించగలిగారు అని ట్వీట్ చేశారు.