ఏపి ఈసెట్‌ ఫలితాలు విడుదల

Results
Results

అమరావతి: ఏపిలో ఈసెట్‌- 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఏపి ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్‌లో 96.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. ఈసెట్‌ పరీక్షకు 25,160 మంది విద్యార్థులు, 6,731 మంది విద్యార్థినిలు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తం 37,160 మంది ఈసెట్‌కు అప్లై చేయగా, 31,989 మంది హాజరైనట్లు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/