అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ నజీబ్ మృతి

మృతి చెందాడని ప్రకటించిన అఫ్ఘాన్ క్రికెట్ బోర్డు

afghanistan-cricketer-najeeb-tarakai-dies-following-car-accident

ఆఫ్గానిస్థాన్‌: ఆఫ్గానిస్థాన్‌ క్రికెటర్‌ నజీబ్ తరకై (29)‌ మృతి చెందాడు. ఈవిషయాన్ని ఆఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు ఈ రోజు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ప్రకటించింది. గత శుక్రవారం ఆయన జలాలబాద్‌లోని మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఆయనను ఓ కారు ప్రమాదవ శాత్తూ ఢీ కొట్టింది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాల కారణంగా ఆయన కోమాలోకి వెళ్లిపోయాడని వైద్యులు ఆ సమయంలో చెప్పారు. ఆయనకు శుక్రవారం నుంచి చికిత్స అందుతోంది.

‘దూకుడుగా ఆడే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌, మంచి వ్యక్తి నజీబ్‌ తరకై మృతి పట్ల ఆఫ్గానిస్థాన్‌ క్రికెట్ బోర్డు, దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయి ఆయన మనందరిని విషాదంలో ముంచారు. ఆయన పట్ల అల్లా కరుణ చూపాలని కోరుకుంటున్నాము’ అని ఏసీబీ ట్వీట్ చేసింది.

కాగా, 2014లో ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కెరీర్‌లో మొత్తం 12 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైట్‌ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ 2017లో గ్రేటర్‌ నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 90 పరుగులు చేశాడు. టీ20ల్లో ఆయన చేసిన అత్యుత్తమ స్కోరు ఇదే. చివరిసారిగా ఆయన గత ఏడాది సెప్టెంబరు 15న బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/