సడలింపులపై కేంద్రం మరోసారి సమీక్ష నిర్వహించాలి

సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయణ

laxmi narayana
VV. laxmi narayana

అమరావతి: దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపులు ఇస్తు, మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో నిన్న దేశంలో పలు రాష్ట్రాలలో మద్యం దుకాణాలు తెరచుకున్నాయి. కరోనా విజృంభణ తగ్గక ముందే లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడం వల్ల ఇన్నాళ్లుగా పాటించిన లాక్‌డౌన్‌ వృధా అవుతుందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలపై సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ స్పందిస్తూ కీలక వాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్రం మరోసారి సమీక్ష నిర్వహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చి, మద్యం దుకాణాలు తెరవడం వల్ల కరోనా వ్యాప్తి అధికం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయని, అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. ప్రజల జీవితాలను ప్రమాదంలో పెట్టోద్దు అని లక్ష్మీనారాయణ అన్నారు. కాగా మద్యం అమ్మకాలకు అనుమతులు లభించడంతో నిన్న ఏపిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మందు ప్రియులు వైన్‌ షాపుల ముందు బారులు తీరిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/