నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లు

TTD
TTD

తిరుమలః తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ నెలకు సంబంధించి టికెట్లను ఈరోజు విడుదల చేయనున్నారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను ఈ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని టిటిడి స్పష్టం చేసింది.

కాగా, 10 ఎలక్ట్రిక్ బస్సులు నేడు తిరుమల చేరుకోనున్నాయి. ధర్మరథం పేరిట నిర్వహించే సర్వీసుల కోసం వీటిని వినియోగించనున్నారు. విద్యుత్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా ఈ బస్సులను టిటిడికి విరాళంగా ఇస్తోంది. ఈ విద్యుత్ బస్సులకు టిటిడి ప్రత్యేక పూజలు చేయనుంది.