రాజమండ్రిలో త్వరలో దిశ పోలీస్‌ స్టేషన్‌

ఏపి హోంమంత్రి మేకతోటి సుచరిత

AP Home minister Sucharita
AP Home minister Sucharita

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో త్వరలోనే దిశ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు కానున్నట్లు ఏపి హోంమంత్రి సుచరిత అన్నారు. ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పోలీసులకు ఈ చట్టం అములకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. మహిళా భద్రతపై ముఖ్యమంత్రి చిత్తశుద్దితో ఉన్నారని సుచరిత తెలిపారు. మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఏపిలో నే సంవత్సరానికి 12 నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు హోంమంత్రి. శిక్ష కూడా వెంటనే పడుతుందన్న భయంతో నేరాలు తగ్గుతాయని ఆశిస్తున్నామన్నారు. అనేక రాష్ట్రాలు దిశా చట్టం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దిశా చట్టం పై కేంద్రం కొన్ని టెక్నికల్ క్లారిఫికేషన్ అడిగినట్లుగా తెలిపారు. అవి పూర్తి చేసి మళ్లీ దిశా చట్టాన్ని కేంద్రానికి పంపినట్లుగా సుచరిత పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/