నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేదు

హత్రాస్ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యుల ప్యానల్ ..సిఎం యోగి

నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేదు
cm-yogi-adityanath

లక్నో: హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత యువతిపై నలుగురు సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి హింసించిన ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానల్ ను నియమిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సిఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రకటించారు. ఈ కమిటీ దర్యాప్తు జరిపి ఏడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సిఎం ఆదేశించారు. ఈ కేసులో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని సిఎం హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌ధాని కూడా త‌న‌ను ఆదేశించార‌ని సిఎం యోగి తెలిపారు.

కాగా రెండు వారాల క్రితం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌త్రాస్ జిల్లాలో 19 ఏండ్ల యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంతటితో ఆగ‌క ఆమె నాలుక కోసి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. దీంతో రెండు వారాల‌పాటు మృత్యువుతో పోరాడిన ఆమె మంగ‌ళ‌వారం మ‌రణించింది.   


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/