అనసూయ అన్నంతపని చేసింది..

బుల్లితెర, వెండితెర ఫై రాణిస్తున్న అనసూయ..తనపై సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్న వారిపై పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసు పెట్టొద్దు అనుకున్నాను. కానీ, ఇలా చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు థ్యాంక్స్. నన్ను ట్రోల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్‌ మొదలైంది. అప్‌డేట్స్‌ ఇస్తుంటాను. మీరు ఊహించని దానికంటే పెద్దది’ అంటూ కంప్లైట్‌ తాలుకూ స్క్రీన్‌షాట్‌ని షేర్‌ చేసింది.

‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమోకానీ, రావడం మాత్రం పక్కా!’ అని అంటూ ఈనెల 25న అనసూయ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశించే పెట్టిందని అభిప్రాయపడ్డ అతడి అభిమానులు ఆంటీ అంటూ అనసూయను దూషించారు. వేలకొద్ది మీమ్స్‌, ట్వీట్స్‌ చేస్తూ ఆంటీ పదాన్ని ట్రెండ్‌ చేశారు. దీంతో విసిగిపోయిన అనసూయ పోలీసులకు పిర్యాదు చేసింది.