పవన్ బర్త్ డే స్పెషల్ : హరిహర వీరమల్లు గ్లింప్స్‌ రిలీజ్

సెప్టెంబ‌ర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్బంగా హరిహర వీరమల్లు మేకర్స్ అభిమానులకు బర్త్ డే కానుకను ఇవ్వబోతున్నారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే షూటింగ్‌ ప్రారంభ‌మై నెల‌లు గడుస్తున్నా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ల‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించడం లేదు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ మేక‌ర్స్‌పై తీవ్ర ఆస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ గ్లింప్స్‌కు ఓ స్టార్ హీరో వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు వినికిడి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి ప‌వ‌న్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, న‌ర్గీస్ ఫ‌క్రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ఏ. ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నాడు. ఎమ్‌. ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.