పవన్‌తో మాట్లాండేదుకే 15 రోజులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో వకీల్ సాబ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో పవన్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్యాలు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించిన అంజలి పవన్‌తో మాట్లాడేందుకు ఆమెకు 15 రోజుల సమయం పట్టిందని తెలిపింది. తొలుత పవన్ లాంటి స్టార్ హీరోతో మాట్లాడాలంటే భయం వేసిందని, కానీ ఆయనతో పని చేయడం చాలా గొప్పగా అనిపించిందని అంజలి చెప్పుకొచ్చింది. ఇక సినిమాలో పవన్ పర్ఫార్మె్న్స్ పీక్స్‌లో ఉంటుందని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారని ఆమె చెప్పుకొచ్చింది.

దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను బోనీ కపూర్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. మరి వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.