ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ప్రభాస్ రూ.కోటి సాయం

Prabhas
Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు కోటి రూపాయల సాయం అందజేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ లో భారీ వర్షాలు కురిసాయి. ఈ వర్షాలకు భారీగా ఆస్థి ,ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా.. టాలీవుడ్ కదిలింది. ఎన్టీఆర్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా అందరూ రూ. 25 లక్షలను విరాళంగా ప్రకటించారు.

తాజాగా ప్రభాస్ మాత్రం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు. గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్‌ ఇండియా స్టార్‌ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు. ఇక హైద్రాబాద్ వరదల సమయంలోనూ ప్రభాస్ తన మంచి మనసును చాటుకున్నాడు. ఇలా ప్రభాస్ చేసే సాయాలకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకోడు. అందుకే డార్లింగ్ మనసు ఎంతో మంచిదని అంటుంటారు.

ప్రభాస్ ఎప్పుడూ సాయం చేసినా, విరాళం అందించినా కూడా తన స్థాయికి తగ్గట్టుగానే ఇస్తుంటాడు. ఎంతైనా రాజులు రాజులే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీతో అభిమానులు, ప్రేక్షకులను అలరించడానికి జనవరి 14 న రాబోతున్నాడు.