తొలిసారి అలాంటి పాత్రలో రామ్

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ‘రెడ్’ ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రామ్ రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రామ్ రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

లింగుస్వామి తెరకెక్కించబోయే సినిమా పూర్తిగా కాప్ థ్రిల్లర్ మూవీగా రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ తొలిసారి తన కెరీర్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుండగా, ఈ సినిమాతో రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపించేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరి రామ్ తన కెరీర్‌లో తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఆయన అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి రామ్‌ను పోలీస్ పాత్రలో లింగుస్వామి ఎలా చూపిస్తాడో చూడాలి.