ఆస్తి వివాదంపై దాసరి అరుణ్‌ వివరణ

తన ఇంటి గేటు తాను దూకితే తప్పేంటి…అరుణ్‌

dasari-arun

హైదరాబాద్‌: దివంగత దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారులు అరుణ్ కుమార్‌, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దాసరి ప్రభు చేసిన ఆరోపణపై అరుణ్‌ ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటి విషయంలో తమిద్దరి మధ్య వివాదం తలెత్తిన అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎస్‌ఐ సమక్షంలోనే తాను ఇంట్లోకి వెళ్లానని చెప్పారు. గేటు దూకిన సమయంలో మద్యం తాగలేదన్నారు. తన ఇంటి గేటు తాను దూకితే తప్పులేదనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు చాలాసార్లు గేటు దూకి వెళ్లానని చెప్పుకొచ్చారు. ఆ ఇల్లు ఏ ఒక్కరిదో కాదని… తమ ముగ్గురిదన్నారు. వీలునామా ఉంటే కోర్టుకు చూపించాలన్నారు.

తమ సోదరుడు ప్రభు చెప్పేవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆరోపణలపై ఆధారాలుంటే నిరూపించాలన్నారు. సినీ పెద్దలు జోక్యం చేసుకుంటే తనకు అభ్యంతరంలేదన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందని అరుణ్ అన్నారు. కాగా మా అన్నయ్య దగ్గర కోర్టు ఉత్తర్వు ఏమైనా ఉందా? ఆస్తికి సంబంధించిన వీలునామా ఉంటే చూపించాలి. మా అన్నయ్య, సోదరితో నాకు ఎలాంటి వివాదం లేదు. నాపై కేసు పెట్టారు. చేయి చేసుకున్నానని అన్నారు. నేను లేడీస్‌పై చేయి చేసుకోవడం ఏంటీ? అవన్నీ అబద్ధాలు. అరగంట కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్య మాది’ అని వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/