కరోనాని జయించిన బిగ్ బి!

సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడి

Amitabh bachchan
Amitabh bachchan

Mumbai: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనాని జయించారు.

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన అమితాబ్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అమితాబ్ తో పాటు ఫ్యామిలీ మెంబెర్స్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యా రాయ్ – ఆరాధ్య లకు కరోనా సోకింది. అయితే ఇటీవల ఐశ్వర్య –  ఆరాధ్య కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆదివారం అమితాబ్ కి టెస్ట్ లో నెగిటివ్ రావడంతో ఆయనని డిశ్చార్జ్ చేసారు.

అమితాబ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

”కోవిడ్ టెస్ట్ లో నెగిటివ్ రావడంతో నన్ను డిశ్చార్జ్ చేసారు. ఇంటికి తిరిగొచ్చి ఒంటరిగా క్వారంటైన్ లో ఉన్నాను. మా బాబుజీ యొక్క ఆశీర్వాదం మరియు ఆత్మీయులు స్నేహితులు అభిమానులు ప్రియమైన వారి ప్రార్ధనల వలన.. నానావతి హాస్పిటల్ వారు తీసుకున్న కేర్ వల్ల నేను ఈరోజుని చూడటం సాధ్యమైంది”

అని ట్వీట్ చేశారు అమితాబ్. దీంతో బిగ్ బి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/