ప్రముఖ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు మృతి

గుండెపోటుతో చికిత్స పొందుతూ కన్నుమూత: సినీ ప్రముఖుల సంతాపం

BA Raju-File
BA Raju-File

Hyderabad: ప్రముఖ సినీ పీఆర్వో, నిర్మాత బీఏ రాజు (62) మృతి చెందారు. . మధుమేహంతో బాధపడుతున్న ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. బీఏ రాజు తెలుగు చిత్రసీమలో అరుదైన రికార్డ్ ఉంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు పీఆర్వోగా పని చేశారు. పీఆర్వోగా కొనసాగుతూనే నిర్మాతగా మారారు. తన భార్య డైనమిక్ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సూపర్ హిట్ సినీ మ్యాగజైన్ ని దిగ్విజయంగా నడిపించారు. సూపర్ హిట్ పేరుతో అవార్డు కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆయన భార్య బి.జయ 2018లో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు.

బీఏ రాజు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ సహా సినీపాత్రికేయ లోకం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సహా పలు సినీ అసోసియేషన్లు సంతాపం ప్రకటించాయి.

మెగాస్టార్ చిరంజీవి, పలువురు ప్రముఖులు సోషల్ మీడియాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “బిఏ రాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీపరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునే వారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ఈ సమయంలో నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/