నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

మిచౌంగ్ తుఫాన్ ఏపీని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. చేతికి అందిన పంట నీటిపాలైంది. చాల తోటలు దెబ్బతిన్నాయి. అలాగే వందల ఇల్లు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో వరదాప్రభావిత ప్రాంతాలలో నేడు మాజీ సీఎం చంద్రబాబు పర్యటిచబోతున్నారు. ఈరోజు నుంచి రెండు రోజుల పాటుగా మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పనున్నారు. నందివెలుగు, కూచిపూడి లాకులు, అమృతలూరు, ఉత్తర పాలెం మీదుగా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రికి బాపట్లలోనే టీడీపీ కార్యాలయంలో బస చేయనున్నారు. రేపు పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలవనున్నారు. మూడు నెలల తర్వాత చంద్రబాబు ప్రజల మధ్యకు వస్తుండటంతో ఆసక్తిగా మారింది.