హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad

హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక జారీచేసింది GHMC. నగరం లో ఈరోజు , రేపు భారీ వర్షం పడనున్న నేపథ్యంలో నగరవాసులు అనవసరంగా రోడ్ల పైకి రావొద్దంటూ హెచ్చరించింది. వర్షం కాస్త తెరిపి ఇ‍వ్వగానే ఆగమాగం బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్‌ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. భారీ వర్షాలతో నగరం రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉంది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవచ్చు కూడా. అందుకే నిదానంగా బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు.

షియర్‌ జోన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, నాచారం, మల్లాపూర్‌, ఈసీఐఎల్‌, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌‌, వనరస్థలిపురం, హయత్‌నగర్‌, తుర్కయంజాల్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, విద్యానగర్‌, రాంనగర్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌, కాచిగూడ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.