మళ్లీ ‘సిద్ధం’ అంటున్న క్రికెటర్ అంబటి రాయుడు..

క్రికెటర్ అంబటి రాయుడు చేసిన తాజా ట్వీట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘సిద్ధం!!’ అని రాయుడు పోస్ట్ చేయడం చూసిన వారంతా మళ్లీ ఈయన వైసీపీ లో చేరతారా నేటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నేటి నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే రాయుడు ‘సిద్ధం’ అని పోస్ట్ చేయడంతో మళ్లీ వైసీపీలోకి వస్తారా? అనే చర్చ మొదలైంది.

కాగా, గతేడాది డిసెంబర్ లో వైసీపీలో చేరిన రాయుడు.. జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ కలవడం తో రాయుడు జనసేన లో చేరతారు కావొచ్చు అని అంత అనుకున్నారు కానీ రాయుడు మాత్రం జనసేన లో చేరలేదు. ఇక ఇప్పుడు మళ్లీ సిద్ధం అని పోస్ట్ చేయడం తో మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇక ఈరోజు నుండి వైసీపీ అధినేత జగన్ తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. నేడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్నారు. మ.ఒంటిగంటకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, మ.1.30 నుంచి కడప పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. వేంపల్లి, VNపల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రయాణించి సా.4 గంటలకు ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకుని, అక్కడ బస చేయనున్నారు.