ఆర్టీసీ బస్సులో అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారం..

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నేతలు ఎన్నో తిప్పలు పడాలి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో చేయాలి..ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతుంది. అతి త్వరలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగబోతుండడం తో అధికార , ప్రతిపక్ష పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నేత , సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు..ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. దోశలు , టీ లు అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఎన్నికల ప్రచారం చేసారు. సత్తెనపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికులకు వైసీపీ ఎన్నికల కరపత్రాలు పంచి..వైసీపీ తీసుకొచ్చినా సంక్షేమ పథకాలు తెలుపుతూ మరోసారి వైసీపీ ని గెలిపించాలని కోరారు. దీనికి సంబందించిన వీడియో చక్కర్లు కొడుతుంది.