పవన్ కళ్యాణ్ ను పిట్టల దొర తో పోల్చిన అంబటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిట్టల దొర తో పోల్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. మంగళవారం మంగళగిరి లో జనసేన పార్టీ విస్తృత సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్..ఎప్పటిలాగానే వైసీపీ ప్రభుత్వం ఫై విరుచుకపడ్డారు. 2024 లో వైసీపీ అధికారంలోకి రాదని , అసలు వైసీపీ కి ఓటు హక్కు అడిగే హక్కు లేదని , రాష్ట్రాన్ని 20 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లిందని ఇలా చాల ఘాటైన కామెంట్స్ చేసారు.

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మీటింగ్.. పిట్టల దొర వ్యవహారంగా ఉందని ఎద్దేవా చేసారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చూస్తే బీజేపీతో గొడవ పడినట్లు ఉన్నాయని.. టీడీపీకి వచ్చేస్తున్నా అని సంకేతాలు ఇవ్వటానికే మీటింగ్‌ పెట్టినట్లు ఉందని అన్నారు.

‘‘బాబూ వచ్చేస్తున్నా’’ మీటింగ్‌ అని.. కౌలు రైతుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ, అభిమానం ఉన్నాయని చెప్పారు. అందుకే రైతులకే కాకుండా, కౌలు రైతులకు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా ఇస్తున్నామని.. ఏటా రూ.13,500 చొప్పున అయిదేళ్లలో రూ.67,500 ఇస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ పల్టీ నాయకుడని.. ఎవరి పల్లకీ మోయను అంటూనే చంద్రబాబు పల్లకీ తప్ప అన్న కండిషన్‌ పెట్టుకున్నట్టుగా… అదే తన పరమార్థం అన్నట్టుగా కనిపిస్తుందని అంబటి అన్నారు.