రేపు నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన

cm jagan

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు నరసరావుపేటలో పర్యటించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న జగన్ మరికాసేపట్లో ఏపీ కి రానున్నారు. వచ్చి రాగానే గవర్నర్ తో భేటీ కానున్నారు. కేబినెట్ మార్పులపై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి చివరి కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినేట్‌ సమావేశం అనంతరం.. కేబినేట్‌ విస్తారణ జరుగే ఛాన్స్‌ ఉంది.

రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్… 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకోనున్నారు. 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ జరుగనుంది. ఆ తర్వాత ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు . అనంతరం వాలంటీర్లకు సత్కారం కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. 12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ఇక ఢిల్లీ పర్యటన విషయానికి వస్తే ..మంగళవారం ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ స‌మావేశ‌మై ర‌హ‌దారుల నిర్మాణాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. జగన్ తో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. గ‌డ్క‌రీకి జ‌గ‌న్ వేంక‌టేశ్వ‌ర స్వామి చిత్ర ప‌టాన్ని అందించారు. నితిన్ గ‌డ్క‌రీతో స‌మావేశం అనంత‌రం జ‌గ‌న్ ఢిల్లీ విమానాశ్ర‌యానికి వెళ్లారు. కాసేప‌ట్లో ఆయ‌న‌ ఏపీ చేరుకోనున్నారు.