నైజాం లో వంద కోట్ల షేర్ సాధించి ఆర్ఆర్ఆర్ రికార్డు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ లు నట విశ్వరూపం చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ మూవీ నైజాం ఏరియా లో అల్ టైం రికార్డు సాధించింది.

ఒక్క నైజాం ఏరియా లోనే 100 కోట్ల షేర్ రాబట్టి రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఏ చిత్రం కూడా వంద కోట్ల షేర్ రాబట్టలేదు. ఇక ఈ మూవీ తో దిల్ రాజు పంట పండింది. ఈ ఏరియా రైట్స్ ను 70 కోట్లకు దక్కించుకోగా..ఇప్పుడు రెండు వారాలు పూర్తికాకముందే వంద కోట్ల షేర్ రాబట్టడం తో దిల్ రాజు భారీ లాభాలు అందుకున్నాడు. ఇంకా ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్ల తో రన్ అవుతుండడం తో రాజు కు మరిన్ని లాభాలు రావడం ఖాయం అంటున్నారు. మరోపక్క నార్త్ లోను ఆర్ఆర్ఆర్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 200 కోట్లను క్రాస్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ క్రమంలో చిత్ర హిట్ రైట్స్ దక్కించుకున్న పెన్ స్టూడియో వారు ఈరోజు ముంబై లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఏర్పటు చేయబోతున్నారు. ఈ సక్సెస్ మీట్ కు చిత్ర యూనిట్ హాజరు కాబోతున్నారు.