ప్రభాస్ కు జోడిగా రిధి కుమార్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ మారుతీ కలయికలో ఓ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసందే. ప్రస్తుతం ప్రభాస్ ..ఆదిపురుష్ , ప్రాజెక్ట్ కే మూవీస్ తో బిజీ గా ఉన్నారు. ఇందులో ఆదిపురుష్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా , ప్రాజెక్ట్ కే షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో మారుతీ ప్రభాస్ తో చేయబోయే సినిమా కోసం కాస్ట్ & క్రూ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీరిలో మెయిన్ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇప్పటికే ఖరారు చేయగా , తాజాగా మూడో హీరోయిన్‌గా రిధి కుమార్‌ను ఎంపిక చేసారు.

రిధి కుమార్ ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాధే శ్యామ్’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో క్రీడాకారిణిగా రిధి కనిపించారు. కాకపోతే ఈసారి ప్రభాస్‌కు హీరోయిన్‌గా రిధి నటిస్తుండటం విశేషం. దిల్ రాజు 2018లో నిర్మించిన ‘లవర్’ సినిమా ద్వారా రిధి కుమార్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరవాత ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమాలో నటించారు. ఆమె నటించిన ‘సలామ్ వెంకీ’ అనే హిందీ సినిమా వచ్చే నెల విడుదల కాబోతోంది.