‘అమెజాన్ సీఇవో పదవినుంచి తప్పుకుంటున్నా’

జెఫ్ బెజోస్ తాజా ప్రకటన

Jeff Bezos
Jeff Bezos

ఇ -కామర్స్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు, అమెజాన్ సంస్థ సీఇవో జెఫ్ బెజోస్ జూలై 5న సీఈవో పదవి నుంచి కుంటున్నానని తాజాగా ప్రకటించారు. తన స్థానంలో అమెజాన్ ఎగ్జిక్యూటివ్, వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ నూతన సీఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. ఇకపై బెజోస్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జులై 5 తనకు చాలా సెంటిమెంట్ డేట్ అని, అందుకే ఆ రోజే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు బెజోస్ తెలిపారు. తాజాగా జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. 27 ఏళ్ల క్రితం అదే రోజున అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే ఆ తేదీ నాకు చాలా ప్రత్యేకమైనద`ని బెజోస్ అన్నారు. కాగా, 1997లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరిన జెస్సీ అదే సంస్థలో అంచెలంచెలుగా ఎదిగారు.అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/