బిగ్ బాస్ 5 : కూర్చొని కబుర్లు చెపుతున్నావు అంతే..షణ్ముఖ్ ఫై నాగ్ సీరియస్

బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. గొడవలు , అల్లర్లు , ప్రేమలు , టాస్క్ లు ఇలా అన్ని పంచుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారం రోజుల పాటు హౌస్ లో జరిగిన విశేషాలను , తప్పుఒప్పులను శనివారం హౌస్ సభ్యులతో నాగ్ ముచ్చటిస్తుంటారు. ఎవరు తప్పు చేసారో తెలుపుతుంటారు. ఈరోజు కూడా అలాగే చెప్పుకొచ్చారు. దీనికి సంబదించిన ప్రోమో ను విడుదల చేసారు.

ప్రోమో లో..షణ్ముఖ్ ముందు ఓ ప్లేట్ పెట్టి అందులో పచ్చి మిర్చి పెట్టి షణ్ముఖ్ ను తినమన్నాడు. షణ్ముఖ్ మిర్చి ని మెల్లగా తినమ్మా..తిను..కూర్చుని కబుర్లు చెపుతున్నావ్ అంతే అని నాగ్ అనేసరికి షణ్ముఖ్ పేస్ మాడిపోయింది. అమ్మ సిరి నీ ఆట నువ్వు ఆడమ్మా..నీ వల్ల జెస్సి కూడా సఫర్ అవుతున్నాడు అని నాగ్ అనగానే..కెప్టెన్ గా నేను ఫెయిల్ అయ్యానని జెస్సి నాగ్ తో అంటాడు. కానీ తప్పుచేసిన వారు మాత్రం ఒప్పుకోవడం లేదని సభ్యుల పట్ల నాగ్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత లోబో కు క్లాస్ పీకాడు. నామినేషన్ సమయంలో ప్రియా ఫై పెద్ద పెద్దగా అరవడం ఫై నాగ్ సీరియస్ అయ్యారు. ప్రోమో బట్టి చూస్తే ఈవారం హౌస్ సభ్యులందరికి నాగ్ క్లాస్ పీకినట్లు అర్ధమవుతుంది. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.

YouTube video