ఏపికి రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలి

రాజధాని వస్తుందని కాబట్టే రైతులు భూములు త్యాగం చేశారు

Nandamuri Suhasini
Nandamuri Suhasini

అమరావతి: రాజధాని కోసం మందడంలో దీక్ష చేపట్టిన రైతులకు దివంగత హరికృష్ణ కూతురు, నందమూరి సుహాసిని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపికి రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాజధాని వస్తుందని కాబట్టే రైతులు భూములు ఇచ్చారని ఆమె తెలిపారు. రైతుల పోరాటం వల్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల పట్ల పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని సుహాసిని మండిపడ్డారు. మహిళలు తలుచుకుంటే రాజ్యాలు కూలిపోయాయని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా అమరావతి భూముల విషయంలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఏపి ప్రభుత్వం పదేపదే ఆరోపించడాన్ని సుహాసిని తప్పుబట్టారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్టు సాక్ష్యాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. భూముల విషయంలో అవినీతి జరిగివుంటే చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇదే విషయం చంద్రబాబు కూడా పలుమార్లు చెప్పారని ఆమె గుర్తు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/