టిఆర్ఎస్, బిజెపి పొత్తు పెట్టుకున్నాయి
అందుకు ఎన్నో ఆధారాలున్నాయన్న పొన్నం ప్రభాకర్

కరీంనగర్: తెలంగాణలో బిజెపి, టిఆర్ఎస్ మంచి దోస్తులని కాంగ్రెస్ నేత పొన్న ప్రభాకర్ అన్నారు. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్‌కు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ అభద్రతా భావంలో ఉన్నారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయనడం హాస్యాస్పదమని అన్నారు. అసలు తెలంగాణలో కుమ్మక్కైంది టిఆర్ఎస్, బిజెపిలేనని ఆయన అన్నారు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని పొన్న ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణలో టిఆర్ఎస్కు ఇక మీదట అవకాశం లభించదని అన్నారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు టిఆర్ఎస్ కు లేదని పొన్న ప్రభాకర్ చెప్పారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/