జలదీక్ష చేస్తున్న రాజధాని రైతులు

42వ రోజుకి చేరిన రైతుల ఆందోళనలు

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వినూత్నంగా నిరసనలు చేపడుతున్నారు. కృష్ణా నదిలో రాజధాని మహిళలు, రైతులు జలదీక్షకు దిగారు. జై ఆంధ్రప్రదేశ్‌, సేవ్ రాజధాని అంటూ నినాదాలు చేస్తున్నారు. శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఫొటో పట్టుకుని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. 42 రోజులుగా తాము నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పోరాటాలు చేసయినా తాము హక్కులను కాపాడుకుంటామని చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/