చంద్రబాబు నాయుడికి పెద్ద సంకటం వచ్చిపడింది!

మునుపటిలా వాళ్ళను కలిసే అవకాశం లేకుండా పోయింది

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వైఎస్సాఆర్‌సిసి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడికి పెద్ద సంకటమే వచ్చిపడిందని అన్నారు. మునుపటిలా సోనియా గాంధీ, దీదీ మమతా బెనర్జీ, అఖిలేష్‌ యాదవ్‌ వంటి వారిని కలిసే అవకాశం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వారిని కలిసి రాజ్యసభలో మండలి రద్దు బిల్లును అడ్డుకోండని కోరలేని పరిస్థితి అని అన్నారు. ఎందుకంటే వాళ్లను కలిస్తే బిజెపి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ముందు నుయ్యి..వెనుక గొయ్యి లా చంద్రబాబు పరిస్థితి తయరయిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇంకా మరో ట్విట్‌లో పవన్‌కళ్యాణ్‌ రియాక్షను ఎప్పటిలాగే సోషల్‌ మీడియా ముందుగానే ఉహించిందని అన్నారు. చంద్రబాబుకు గాయమైతే ఆయన కంటే ముందు పవన్‌ కళ్యాణ్‌ అమ్మా అని అరుస్తాడని విజయసాయి రెడ్డి సైటైర్లు వేశారు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్‌ నోట్‌ రిలీజ్‌ చేయడం ప్యాకేజి తీసుకున్న వారి బాధ్యత కదా అని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/