అయిదేళ్ల చిన్నారి అత్యాచారం కేసు..నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌

Aluva child rape case: Lone accused Ashfaq Alam sentenced to death, 5 life terms

కొచ్చి: కేర‌ళ‌లోని అలువ‌లో జ‌రిగిన చిన్నారి కిడ్నాప్‌, రేప్ కేసులో నిందితుడు అష్‌ఫ‌క్ ఆల‌మ్‌ కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. ఆ కేసులో జ‌డ్జి కే సోమ‌న్ త‌న తీర్పును ఈరోజు వెలువ‌రించారు. ప్రాసిక్యూష‌న్ చేసిన వాద‌న‌ల‌ను కోర్టు అంగీక‌రించింది. ఇది అత్యంత అరుదైన కేసు అని, నిందితుడికి ఎటువంటి క్ష‌మ అవ‌స‌రం లేద‌ని, స‌మాజానికి అత‌నో స‌మ‌స్య అని కోర్టు తెలిపింది. 110 రోజుల పాటు ఆ కేసులో సుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగాయి. చిల్డ్ర‌న్స్ డే సంద‌ర్భంగా తీర్పును వెల్ల‌డించారు. ఆధారాల‌ను ధ్వంసం చేసినందుకు అష్‌ఫ‌క్‌కు అయిదేళ్ల జైలుశిక్ష విధించారు. మైన‌ర్‌కు డ్ర‌గ్స్ ఇచ్చినందుకు మూడేళ్ల శిక్ష‌, మైన‌ర్‌ను రేప్ చేసినందుకు జీవిత‌కా జైలుశిక్ష‌, మ‌ర్డ‌ర్ చేసినందుకు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధిస్తున్న‌ట్లు కోర్టు చెప్పింది. 7,70,000 జ‌రిమానా చెల్లించాల‌ని నిందితుడికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.