తెలంగాణ లో మరో యువ గుండె ఆగింది

తెలంగాణ రాష్ట్రంలో వరుస పెట్టి యువకులు గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. పట్టుమని పాతికేళ్ళు లేని వారు సైతం ప్రాణాలు విడుస్తుండడం ఆ తల్లిదండ్రులకు దుఃఖ శోకాన్ని మిగులుస్తుంది. చేతికి అందిన కొడుకు పోయాడే అని గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది గుండెపోటుతో మరణించగా..తాజాగా హైదరాబాద్ లో మరో యువ గుండె ఆగిపోయింది.

ఖమ్మం జిల్లాలోని మధిర మండలం బుచ్చిరెడ్డి పాలెం కు చెందిన మురళీ కృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లో సినిమా థియేటర్ లో సినిమా చూస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. చికిత్సనిమిత్తం హుటాహుటిన ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కొడుకు మరణ వార్త విని ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. చేతికి అందిన కొడుకు హఠాన్మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.