ఏపీని వరించిన మరో అవార్డు

ఏపీకి వరుస అవార్డ్స్ దక్కుతున్నాయి. రీసెంట్ గా వైద్యఆరోగ్య విభాగం జాతీయస్థాయిలో రెండు అవార్డులు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. టెలీ కన్సల్టేషన్ విభాగంలోనూ, విలేజ్ హెల్త్ క్లినిక్ ల అంశంలోనూ ఏపీకి ఈ అవార్డులు దక్కాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు కేంద్రమంత్రి డాక్టర్ మన్సుక్ మాండవీయ చేతల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డ్స్ రావడం పట్ల విడదల రజని ని సీఎం జగన్ అభినందించారు.

ఇదిలా ఉండగానే తాజాగా ఏపి ఇంధన శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు ఏపీ గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది.

ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును రాష్ట్ర అధికారులు అందుకున్నారు. ఈ అవార్డును సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ కు జగన్‌కు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృద్వితేజ్ చూపించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, అధికారుల‌ను సీఎం జగన్ అభినందించారు.