ఏపీ ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

దసరా పండగవేళ ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది ఆర్టీసీ. స్పెషల్ బస్ సర్వీసుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు..ఈ స్పెషల్ బస్ సర్వీసుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఇక రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో అదనపు చార్జీలు వంటివి ఏమి ఉండవు. త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామని.. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో సంస్థపై భారం పెరిగిందన్నార ద్వారకా తిరుమలరావు.

మరోపక్క పండుగకు ఊళ్లకు వెళ్ళే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళికలు రెడీ చేసింది. దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులు అందించనుంది. జేబీఎస్ నుండి జిల్లాలకు ఓల్వో బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. అతి తక్కువ ధరలతో బస్ సర్వీసులు నడపనున్నట్లుగా సికింద్రాబాద్ రీజనల్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పికెట్‌, జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాలకు రేపటి నుంచి అతి తక్కువ చార్జీతో లోఫ్లోర్‌, ఓల్వో బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు తెలిపారు.