కమల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

కరోనా బారిన పడిన కమల్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పటల్ వర్గం బులెటిన్ విడుదల చేసారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ..ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా తెలిపారు. ఈబులెటిన్ లో వివరాలను చూసి అభిమానులు , సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని ఆకాంక్షిస్తున్నారు.

తనకు కరోనా సోకినా విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు. దాంతో హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టగానే, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను అభిమానులంతా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ 2’, ‘ఖైది’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్’ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు తమిళ్ బిగ్ బాస్ షో చేస్తున్నాడు. కమల్ ఐసొలేషన్ లో ఉండడం తో రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోంది.